ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్ కి అందరూ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా… సుప్రీంలో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వస్థలం కర్నాటక. 1983 లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2003 నుంచి 2017 వరకూ కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా పనిచేశారు. 2017 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.