తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన గెజిట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ సీజేగా బాధ్యతల్లో వున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన స్టానంలో జస్టిస్ భుయాన్ నియమితులయ్యారు. జస్టిస్ ఉజ్జల్ భుయాకు పదోన్నతి కల్పించాలంటూ సుప్రీం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.