ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీలో యాత్రకు బయల్దేరుతున్నారు. శనివారం నుంచి ఏపీలోని 23 జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుందని పాల్ ప్రకటించారు. ‘పాల్ రావాలి.. పాలన మారాలి’ అన్న ట్యాగ్ పేరుతో యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. ప్రాణాలు పోయినా.. ఇబ్బందులు వచ్చినా.. యాత్రను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఈ యాత్ర సందర్బంగా తనకు హాని కలిగితే అందుకు ఏపీ సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అయితే.. అటు సీఎం జగన్ తో కానీ, మాజీ సీఎం చంద్రబాబుతో గానీ తనకు వ్యక్తిగత వైరం లేదని, కేవలం వారు అనుసరించే విధానాల విషయంలోనే విభేదం వుంటుందని పాల్ స్పష్టం చేశారు.