తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించే హాస్య నటుడు కాదంబరి కిరణ్. ఆయన కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ నగరంలోని తారామతి బారాదరిలో ఈ వివాహం జరగింది. తెలంగాణ సినిమా శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా టాలీవుడ్ సీనియర్, జూనియర్ నటులు కూడా హాజరయ్యారు. హీరో శ్రీకాంత్, అలీ, సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు వివాహానికి హాజరై.. నూతన వధూ వరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు తనికెళ్ల భరణి, భాస్కరభట్ల, సాయి కుమార్, రఘుబాబు, రాకెట్ రాఘవ, సుబ్బరాయ శర్మ, వినోద్ బాల, రజిత, రచ్చ రవి తదితరులు హాజరయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో కాదంబరి కిరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత పూరీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలోనూ కాదంబరి కిరణ్ నటించారు. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కాదంబరి కిరణ్ కనిపిస్తారు.