దాదాపు 700 ఏండ్ల తర్వాత కాకతీయుల వారసుడు ఓరుగల్లు గడ్డపై అడుగుపెట్టాడు. కమల్ చంద్ర భంజదేవ్ 7 రోజుల పాటు వరంగల్ లోనే వుండనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర అధికారులు కమల్ చంద్ర భంజదేవ్ కు ఘన స్వాగతం పలికారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది.
ఈ సప్తాహం కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజదేవ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకూ కాకతీయ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాకతీయుల పాలనా వైభవాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేసేలా ఉత్సవాలు జరుగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలను ఉత్తేజ పరిచేలా కళా ప్రదర్శనలు, ఫొటో ఎగ్జిబిషన్ కూడా వుంటుందని అధికారులు తెలిపారు.