Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హీరో కమల్ హాసన్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌..చెన్నైలోని హాస్పిట‌ల్ చేరిక‌..

వెర్సటైల్ హీరో, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆయన్ని చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. గత ఏడాది ఆయనకు కోవిడ్ పాజిటివ్ కారణంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. మళ్లీ ఇప్పడు ఆయన ఆసుపత్రిలో జాయిన్ కావటంపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఆయన బిజీగా ఉంటున్నారు. ఐదు ద‌శాబ్దాల‌కు పైగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన విల‌క్ష‌ణ హీరో క‌మ‌ల్ హాస‌న్  తీవ్ర అస్వ‌స్థ‌త‌తో చెన్నైలోని   హాస్పిట‌ల్‌లో చేరారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. తీవ్ర‌మైన జ్వ‌రంతో పాటు శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బంది రావ‌టంతో క‌మ‌ల్ హాస‌న్ హాస్పిట‌ల్‌లో చేరారు. పోస్ట్ కోవిడ్ ల‌క్ష‌ణాలు అయ్యుంటాయ‌ని, అందుక‌నే ఆయ‌న‌కు శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బందులు వ‌చ్చాయి. రీసెంట్‌గానే బంధు మిత్రులు సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బుధవారం రోజున హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ ఆయ‌న క‌ళా త‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌ని క‌లిశారు. వారిద్దరూ ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ హాస్పిటల్‌లో  చేరారనే విషయం తెలియగానే ఆయన ఫ్యాన్స్ తమ అభిమాన నాయకుడికి ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. సినిమా అంటే ఇష్టపడే వారికి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. దర్శకుడిగానూ ప్రయోగాత్మక చిత్రాలు చేసి మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ రియాలిటీ   షోను తమిళంలో హోస్ట్ చేస్తున్నారు. అలాగే శంకర్‌తో   కలిసి ఇండియన్ 2  సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది ఆయన విక్రమ్  సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతకు ముందే ఆయన కరోనా పాజిటివ్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత రెస్ట్ తీసుకుని వచ్చి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. తర్వాత వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఇండియన్ 2ను పూర్తి చేయటానికి రెడీ అయ్యారు. మరో వైపు మణిరత్నం  దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.కమల్ హాసన్ ఇద్దరు కుమార్తెలు శ్రుతీ హాసన్  , అక్షర హాసన్   సైతం సినీ పరిశ్రమలోనే ఉన్నారు.

Related Posts

Latest News Updates