ప్రపంచంలోనే అత్యంత పేరు మోసిన ఆస్కార్ అవార్డు అకాడమీ నుంచి హీరో సూర్యకు అవార్డు రావడం పెద్ద పండగగా మారింది. ఇలా ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ హీరోగా సూర్య రికార్డుల్లోకెక్కారు. దీంతో సీనియర్ నటులు, ఆయన అభిమానులు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే కోవలో కమల్ హసన్ కూడా సూర్యకు విషెస్ తెలిపారు. నా బ్రదర్ సూర్యకి ఆస్కార్ నుంచి పిలుపు వచ్చినందుకు చాలా గర్వంగా వుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవ్ మెంట్ ను ఎంజాయ్ చేయు అంటూ సూర్యకు సూచించాడు.
Glad my brother @Suriya_offl treads the ground of stars. In spite of gravity, which makes wings weak. We created angels and stars. Hence be proud brother to join the crowd of excellence.
— Kamal Haasan (@ikamalhaasan) June 29, 2022
కమల్ హసన్ నటించిన విక్రమ్ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో సూర్య చేసిన రోలెక్స్ పాత్ర అత్యద్భుతం. అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. సూర్య నటనకు కమల్ తెగ ముచ్చటపడ్డాడు. దీంతో కమల్ సూర్యకు రోలెక్స్ వాచ్ బహుమానంగా కూడా పంపారు.