Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రభాస్‌కు ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘కన్నప్ప’ టీం

డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకుంటూపోతోన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో ప్రతీ ఇండస్ట్రీలోని స్టార్ హీరో భాగస్వామి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, కన్నడ ఇండస్ట్రీ నుంచి శివ రాజ్ కుమార్, కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇలా ప్రతీ ఒక్క స్టార్ హీరో కన్నప్ప చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించనున్నారు. దీంతో ఈ చిత్రంతో నేషనల్ వైడ్‌గా హైప్ పెరిగింది.

ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) సందర్భంగా కన్నప్ప టీం డార్లింగ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రభంజనమై ప్రేక్షక హ‌ృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి శత శత మానం భవతి అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు.

ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

Related Posts

Latest News Updates