Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

KARTHIKEYA 2 REVIEW

మూవీ : ‘కార్తికేయ2’
ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 3/5
నిర్మాణ సంస్థలు  : పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్
నటీనటులు : నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌, కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాసరరెడ్డి, వివా హర్ష, సత్య, ప్రవీణ్, తులసి తదితరులు
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫీ & ఎడిటర్ : కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాతలు:  టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల తేది: ఆగష్టు 13, 2022

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. నిఖిల్‌ సిద్ధార్థ్‌, చందు మొండేటి కాంబి లో భారీ బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో ‘కార్తికేయ2’ గా ఈ రోజు శనివారం (ఆగష్టు 13న) మన ముందుకు వచ్చాడు. ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన సరి కొత్త కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం, ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై  హైప్‌ క్రియేట్‌ అయింది.మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ ఏంటంటే?
కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్. సైన్టి ఫిక్ గా ఆలోచించే ప్రాక్టికల్ పర్సన్.  ఓ సమస్యను చేధించడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. అయితే, ఇలాంటి కార్తికేయ తన తల్లి మొక్కిన మొక్కును తీర్చడానికి ఆమెతో కలిసి ద్వారక కు వెళ్తాడు. శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైన ఈ ద్వారకా నగరంలో కార్తికేయ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే పోలీసుల నుంచి ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) కార్తికేయను తప్పిస్తొంది. ఇంతకీ ముగ్ధ ఎవరు ?, ఆమెకు కార్తికేయకు మధ్య సంబంధం ఏమిటి ?, అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్‌ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్‌ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. అసలు కార్తికేయను ద్వారకకు శ్రీకృష్ణుడు ఎందుకు రప్పించాడు ? చివరకు కార్తికేయ ఏం సాధించాడు ?, ఈ మొత్తం వ్యవహారంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగిలిన కథ.

ఎవరెలా చేసారు?
కార్తికేయ1 లాగే  కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. తన  పాత్రలో నిఖిల్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని అడ్వెంచర్ సన్నివేశాల్లో అలాగే సెకండాఫ్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా నిఖిల్ నటన చాలా బాగుంది. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్‌ న్యాయం చేసింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.  కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్‌ అనుపమా క్యారెక్టర్‌ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీనివాస్ రెడ్డి, హర్ష,  ప్రవీణ్‌, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం ఎలా చేసారంటే  :
మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు చందు, ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం, నేపధ్య సంగీతం  బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లను అభినందించాలి. వారి  నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు:
అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్‌ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్‌ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది. కార్తికేయ1లో మాదిరి ఇందులో భయపడే సీన్స్‌ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్‌ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్‌ కలుగుతుంది. అదే విధంగా విలన్‌, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్‌గా తప్పించుకోవడం లేదా ఆ సీన్‌ని హడావిడిగా ముంగించి వేరే సీన్‌లోకి తీసుకెళ్లడంతో థ్రిల్‌ మూమెంట్స్‌ మిస్‌ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్‌ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్‌ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్‌ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు చందు రాసిన కథ, అడ్వెంచర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు,  కమర్షియల్‌ హంగుల కోసం సాంగ్స్‌, కామెడీని జోడించకుండా  ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  అయితే, కొన్ని సీన్స్ కన్ ఫ్యూజన్ గా క్లారిటీ లేకుండా సాగడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

Related Posts

Latest News Updates