ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరహార దీక్ష ముగిసింది. బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు, సీపీఐ నేత నారాయణ తదితరులు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన దీక్షకు మద్దతు ఇచ్చిన పార్టీలకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని తెలిపారు.
మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం.. సాధించి తీరాలి అని కవిత స్పష్టం చేశారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం మా పోరాటం కొనసాగుతోంది. మహిళా రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదని ప్రకటించారు. మోదీ సర్కార్ తలచుకుంటే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ఇక… ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ దగ్గర దీక్ష ప్రారంభించారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ దీక్ష ప్రారంభించి, ప్రారంభోపన్యాసం చేశారు.
కవిత దీక్షలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, చిత్ర సర్వార, నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్) శివసేన ప్రతినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), కే.నారాయణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్ రాజక్ (ఆర్ఎల్‌డీ), కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ సహా పలు విపక్ష పార్టీల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.