Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ వేడుకలలో కేంద్ర హోం మంత్రి

హైదరాబాద్  హకీంపేటలో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ముందుగా సీఐఎస్ఎఫ్ భద్రతా దళా లు సమర్పించిన గౌరవవందనం స్వీకరించారు. అమిత్ షా మాట్లాడుతూ 53 ఏళ్లుగా దేశసేవలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌కి  కావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చడంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తాం. సీఐఎస్‌ఎఫ్‌లో  డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తాం. సీఐఎస్ఎఫ్ సేవలను చూసి దేశం గర్విస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates