Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

యూట్యూబ్ ఛానళ్లను నడపొద్దు : కీలక ఆదేశాలు జారీ చేసిన కేరళ సర్కార్

కేరళలోని వామపక్ష ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేసే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా యూట్యూబఖ ఛానళ్లను నడపొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అలాచేస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది. యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

 

ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. ఉద్యోగులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించేందుకు మాత్రమే వారి వ్యక్తిగత స్వేచ్ఛ పరిమితమని, సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండేందుకు, యూట్యూబ్ చానల్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందేందుకు దానిని ఉపయోగించకూడదని జీవోలో పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది.

Related Posts

Latest News Updates