ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ జరుగుతుందని అందరికీ తెలిసింది. దీంతో ఏదో కొంత మంది మాత్రమే మాల్ కు వస్తారని సినిమా యూనిట్ అనుకుంది. తీరా… ప్రమోషన్ ఈవెంట్ ప్రారంభమయ్యే సమయానికి మాల్ మొత్తం నిండిపోయింది. ఊపిరాడనంత జనం వచ్చి చేరారు. కేరళలోని కోజికోడ్ లో వున్న హైలెట్ మాల్ లో థల్లుమాల ప్రమోషన్ ఈవెంట్ ను చూసేందుకు పబ్లిక్ వచ్చారు. తీరా… ప్రమోషన్ ఈవెంట్ ప్రారంభమయ్యే సమయానికి ప్రేక్షకులు పోటెత్తారు. దీంతో చిత్ర యూనిట్ బిత్తరపోయింది.
ఏం చేయాలో అర్థం కాక… ఏకంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.దీంతో పోటాపోటీగా ఈ ప్రోగ్రామ్ ను తిలకించేందుకు వచ్చిన వారంతా నిరాశగా ఇళ్లకు వెళ్లిపోయారు. ఇవ్వాళ మలయాళం మూవీ థల్లుమాల రిలీజ్ అయ్యింది. టోవినో థామస్ హీరో. అయితే… ఈ ఈ వెంట్ పై హీరో టోవినో థామస్ స్పందించాడు. నాపై అమితమైన ప్రేమను కురిపించిన కోజికోడ్ వాసులకు ధన్యవాదాలు. ఇంత భారీ ప్రేక్షకావళిని ఒకేచోట నేనెన్నడూ చూడలేదు’ అని ఆయన కామెంట్ పెట్టారు.
#WATCH | Huge crowd gathers at the Hilite Mall in Kozhikode, Kerala where the promotion of an upcoming Malayalam movie titled, 'Thallumaala' was to be held. The promotional event was eventually canceled. (10.08) pic.twitter.com/49V4kSfMuw
— ANI (@ANI) August 11, 2022