కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య రాజకీయాల నుండి రిటైర్ కానని చెప్పారు. మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయేవి తన చివరి ఎన్నికలు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని తెలిపారు. అయితే రిటైర్ మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. 224 సీట్లు ఉన్న కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి మే 24న ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలు జరగనున్నాయి.
