తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సంచలనమై కూర్చుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది.
ఇటీవల నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్ అలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పాఠశాలకు హాజరు కాకుండా రాజకీయాలు, స్థిరాస్తి వ్యాపారం చేశారన్నది ఆయనపై వచ్చిన అభియోగం. దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ఈ ఉతర్వులు జారీ చేసింది.