తెలుగు రాష్ట్రాల్లోనే ఖైరతాబాద్ వినాయకుడికి అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రతి యేటా వారు అందరికి భిన్నంగా విగ్రహ రూపాన్ని తయారు చేస్తారు. అయితే.. ఈసారి మహాలక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది.
విగ్రహానికి కుడివైపు సుబ్రహ్మణ్యుడు, ఎడమవైపు సరస్వతీ దేవి విగ్రహం వుంది. 50 అడుగుల ఎత్తుతో మట్టి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ యేడాది గతానికి భిన్నంగా మట్టి ప్రతిమ వుంటుందని కమిటీ ప్రకటించింది.