ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే… బీజేపీ నుంచి కానీ, అటు కిరణ్ కుమార్ రెడ్డి వర్గం నుంచి మాత్రం ఎలాంటీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే… మాజీ ముఖ్యమంత్రిగా పనిచేయడం, జాతీయ స్థాయిలో కూడా మంచి సంబంధాలే వుండటంతో… ఆయనకు జాతీయ స్థాయిలోనే బాధ్యతలు ఇచ్చేందుకు బీజేపీ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా తెలియజేశారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓకే అన్నారని సమాచారం. నేడు హైదారాబాద్ కు బీజేపీ అగ్రనేత అమిత్ షా రానున్నారు. ఆయన సమక్షంలోనే కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంత కొంత గ్యాప్ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరినా… పార్టీలో క్రియాశీలకంగా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే వుంటున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెబుతారంటూ అప్పట్లో బాగానే వార్తలు వచ్చాయి. కానీ…. అదీ ఖరారు కాలేదు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీని ఎంచుకున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. నల్లారి కుటుంబం కాంగ్రెస్ తో సుదీర్ఘ కాలం కొనసాగింది. 2010లో కిరణ్ ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం..జగన్ వ్యవహారం సెట్ చేసేందుకు అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం కిరణ్ పైన నమ్మకం పెట్టుకుంది. జగన్ పైన కేసులు..ఆ తరువాతి పరిణామాల్లో కాంగ్రెస్ నిర్ణయాల వెనుక కిరణ్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపించారు. రాష్ట్ర విభజన సాధ్యం కాదని ..విభజన జరిగితే తెలంగాణ నష్ట పోతుందని వాదించారు. అప్పట్లో వ్యవహారం కిరణ్ కుమార్ వర్సెస్ కేసీఆర్ గా మారింది.