ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండపిడ్డారు. కేసీఆర్ గైర్హాజర్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. పనికిరాని విమర్శలు చేస్తూ… నీతి ఆయోగ్ పై బురదజల్లుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ఇళ్ల మంజూరులో కేంద్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం తన వంతు వాటా ఇవ్వడానికి సిద్ధపడిందని, గతంలో మంజూరు చేసిన ఇళ్లనే టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టలేదని, కట్టినా… వారి కార్యకర్తలు, సానుభూతిపరులకే ఇచ్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని పలు కీలక శాఖలు ఇంకా సీఎం కేసీఆర్ చేతుల్లోనే వున్నాయని, తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, తమ కుటుంబం చేతుల్లోంచి అధికారం పోతుందన్న భయం సీఎం కేసీఆర్ మదిలో వుందన్నారు. తన కుమారుడు కేటీఆర్ ఇంకా సీఎం కాలేకపోతున్నారన్న బాధ కేసీఆర్ లో వుందని కేంద్ర మంత్రి సెటైర్ వేశారు.