Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దేశంలో పర్యాటకాభివృద్ధికి 7 వేల కోట్లు ఖర్చు చేశాం : G20 సదస్సులో కిషన్ రెడ్డి

గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ లో జీ 20 టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా,కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్ తోపాటు జీ-20 సభ్య దేశాలతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, పర్యాటక రంగం భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా తర్వాత భారత దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకురావడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనతోపాటుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని కిషన్ రెడ్డి వివరించారు.

దేశంలో పర్యాటకాభివృద్ధికి గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రూ. 7వేల కోట్లను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు స్వల్పకాల హాస్పిటాలిటీ కోర్సులు, స్కిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్, వివిధ కార్యక్రమాల కోసం డిజిటల్ కోర్సులు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు.

2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా అన్ని జీ20 సభ్యదేశాలు కృషి చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. భారతదేశం ఓవైపు ప్రకృతి రమణీయత కలిగిన పర్వాతాలు, అందమైన బీచ్‌లు, నదులు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నిర్మాణాలు మరోవైపు, చక్కటి వన సంపద, రాయల్ బెంగల్ టైగర్, గిర్ సింహాలు, ఒంటికొమ్ము రైనోలు వంటి వివిధ వన్యప్రాణులు, వివిధ భాషలు, వివిధ సంస్కృతులకు కేంద్రమని ఆయన వివరించారు.

దేశంలో పర్యాటకాభివృద్ధికి గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు రూ. 7వేల కోట్లను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు స్వల్పకాల హాస్పిటాలిటీ కోర్సులు, స్కిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్, వివిధ కార్యక్రమాల కోసం డిజిటల్ కోర్సులు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates