సీఎం జగన్ ప్రభుత్వంపై ఉదయం నుంచి రాత్రి వరకు దుష్ర్పచారం చేయడమే ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు పనిగా పెట్టుకున్నాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ను దించాలని వారు కంకణం కట్టుకున్నారని, చంద్రబాబు సీఎంగా వుంటే దోచుకోవచ్చన్నదే వారి ఆలోచన అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్లీనరీలో కొడాలి నాని ప్రసంగిస్తూ టీడీపీపై ఫైర్ అయ్యారు. వీరికి ఎవరూ భయపడరని, వారిని పాతాళంలో తొక్కేందుకు రెడీగా వున్నామని కొడాలి నాని అన్నారు.
పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిస్తున్నా.. విమర్శలు చేస్తున్నారని అన్నారు. పేదలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు పెంచుతూ పోతున్నారని, 95 శాతం హామీలను నెరవేర్చిన సీఎం జగన్ అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ భగభగమండే సూర్యుడి లాంటోడు అని కొడాలి నాని అభివర్ణించారు.