తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారు. అయితే… బీజేపీలో చేరే విషయమై త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను మాత్రం ఆయన ఖండించారు. అయితే.. కేసీఆర్ ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకే వుందని ఆయన అనేకమార్లు చెప్పారు. తాజాగా… తాను టీఆర్ఎస్ ను ఓడించే పార్టీలోనే వుంటానని పరోక్షంగా బీజేపీ ప్రస్తావన తెచ్చారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గనక కాంగ్రెస్ ను వీడితే… నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లేనని అంటున్నారు.