ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మొదటి సారిగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. పార్టీలో చేరిన తర్వాత మర్యాద పూర్వకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బండి సంజయ్ కొండాను సన్మానించారు. బీజేపీలో చేరిన తర్వాత తనను చాలా మంది పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు.
తాను నెలకో నేతనైనా బీజేపీలో చేర్పిస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ కు ముకుతాడు వేసే సత్తా బీజేపీకే వుందని, మరే ఇతర పార్టీకీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరిగితే, తాను అక్కడే వుంటానని కొండా ప్రకటించారు. కాళ్లు మొక్కించుకోవడం, డబ్బులు తీసుకోవడం, కేసులతో బెదిరించడం.. ఈ మూడు విధానాలే టీఆర్ఎస్ లో నడుస్తున్నాయని కొండా విమర్శించారు.