చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభ వేదికగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్ స్వయంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేయి పట్టుకొని మరీ.. కార్యకర్తలకు, సభకు పరిచయం చేయించారు. అంతకు ముందు ట్విట్టర్ వేదికగా కూడా కొండా ఈ విషయాన్ని ప్రకటించారు.
2013 లో టీఆర్ ఎస్ లో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 75 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత.. 2018 లో టీఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత 2021 లో్ కాంగ్రెస్ కి కూడా రాజీనామా చేశారు. సొంతంగా ఓ పార్టీ పెడుతున్నట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. చివరికి ఆయన బీజేపీలో చేరారు.