Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కరాటే కళ్యాణి విషయంగా తెలంగాణ గవర్నర్ ను కలిసిన ద్రావిడ దేశం కృష్ణారావు

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణం లకారం చెరువులో శ్రీకృష్ణుని రూపంతో రాజకీయ నాయకుల శిలా విగ్రహo పెట్టడాన్ని వ్యతిరేకత తెలియజేసిన ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణికి షోకాస్ నోటీసు జారీ చేసి ఆమె సభ్యత్వాన్ని సస్పెన్షన్ లో పెట్టిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) చర్యను ఖండిస్తూ “ద్రావిడ దేశం ” అధ్యక్షుడు వి. కృష్ణారావు ఈరోజు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ్ఇసై సౌందర్రాజన్ గారిని హైదరాబాదులో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
స్వర్గీయ ఎన్.టి.రామారావు గారిని ఒక మహానటుడుగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా అందరి మన్నలను పొందారని అటువంటి మహానటుని శిలా విగ్రహాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నా ఎవరూ ఆక్షేపణ తెలియజేయలేదనియు ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని తాను నటించిన శ్రీ కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయడం తగదని కరాటే కళ్యాణి అన్నారే తప్ప ఇంకా ఏ విధంగా ఎవరిని విమర్శించలేదు. ఇంతకు క్రితం సినీ నటులు పోసాని కృష్ణమురళి , పృధ్వీరాజ్ లాంటి వారు ఎన్ని విమర్శలు చేసినా, మోహన్ బాబు షూటింగ్ సమయంలో సహనటులను చేయి చేసుకున్నా, దూషించినా, ఎన్టీ రామారావు గారిని కించపరుస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీసినా ఎటువంటి చర్యలు తీసుకోని మా అసోసియేషన్ వారు బడుగు, బలహీనవర్గాలకు చెందిన కరాటే కళ్యాణికి మాత్రమే నోటీసులు జారీ చేయటమే గాక ఆమెను మా అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెన్షన్ లో ఉంచటం అన్యాయమనియు, అంతేకాకుండా కొంతమంది సంఘవిద్రోహులు కరాటే కళ్యాణి ఇంతకు క్రితం నటించే సినిమాలను సన్నివేశాలను జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా ఆమెకు ఫోన్లు చేసి దుర్భాషలాడుతున్నారనియు, ఈ విషయంలో తెలంగాణ పోలీసులు తగిన చర్యలు తీసుకోనందువల్ల గవర్నర్ గారు కలగజేసుకొని వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవడానికి కలుగజేసుకోవాలని, మా అసోసియేషన్ లో కరాటే కళ్యాణి సభ్యత్వాన్ని పునరుద్ధరించటానికి సహాయం చేయాలని కృష్ణారావు గవర్నర్ గారికి నేరుగా విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు.

Related Posts

Latest News Updates