హీరోయిన్ రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారని కొన్ని రోజులుగా తెగ పుకార్లు నడుస్తున్నాయి. ఈ విషయంపై కృష్ణవంశీ ఎట్టకేలకు నోరు విప్పారు. విడాకుల విషయం పూర్తిగా తప్పని కొట్టిపారేశారు. పబ్లిక్ ఫిగర్స్ గా వున్న సమయంలో ఇలాంటి పుకార్లు సహజమని అన్నారు. కానీ… ఆ పుకార్లను తాము పెద్దగా పట్టించుకోమని, అందుకే ఖండించాలని కూడా అనుకోమన్నారు. ఓ నవ్వు నవ్వి ఊరుకుంటామని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్ద మార్పులంటూ ఏమీ రాలేదని, ఎలా వున్నానో తనను అలాగే వుండనిచ్చిందని చెప్పుకొచ్చారు.
మొదటి నుంచీ తనకు బంధాలు, బాధ్యతలంటే ఇష్ట ముండదని, ఎప్పుడూ ఒంటరిగానే వుంటానని చెప్పారు.రమ్యకృష్ణను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, ఆమె అభిరుచులకు తగ్గట్టుగానే వుంటానని చెప్పారు. ఆమె కూడా తన అభిప్రాయానికి విలువనిస్తుందన్నారు. తమ మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు.
ఇక… డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగమార్తాండ. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఓ వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ… విడాకుల రూమర్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చుకున్నారు.