Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రివ్యూ: కామెడీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’

ప్రపంచతెలుగు.కామ్ రేటింగ్ 2.5/5

కథ
కృష్ణాచారి(నాగ శౌర్య) ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి కనిపించే డీసెంట్ కుర్రాడు. అమృతవల్లి (రాధిక శరత్ కుమార్) శివగామి టైపు. ఊర్లో ఆమె చెప్పిందే శాసనం. ఆమె చెబితే జరగాల్సిందంతే. ఆమె ధాటికి భయపడి ఊర్లోని అమ్మాయిలంతా కూడా కృష్ణాచారినీ  అన్నయ్య అని పిలుస్తుంటారు. అమృతవల్లి కృష్ణాచారినీ ఎంతో పద్దతిగా పెంచుతుంది. అలాంటి  కృష్ణాచారి హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ జాబ్ కోసం వస్తాడు. ఉద్యోగం చేస్తాడు.  అక్కడే  వ్రిందా(షిర్లే) ని చూసి ప్రేమలో పడతాడు. అయితే వ్రిందకు పిల్లలు పుట్టరనే సమస్య ఉంటుంది. అయినా సరే పెళ్లి చేసుకుందామని  కృష్ణాచారి అంటాడు. కానీ అమృతవల్లి మాత్రం చనిపోయిన తన తల్లి కృష్ణ కడుపులో పుడుతుందని ఆశపడుతుంది. ఇలాంటి సమయంలో  కృష్ణాచారి ఆడిన అబద్దం ఏంటి? వ్రిందను పెళ్లి చేసుకునేందుకు  కృష్ణాచారి పడ్డ పాట్లు ఏంటి? పెళ్లి అయ్యాక కృష్ణాచారి ఆడిన అబద్దాల వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు  కృష్ణాచారి వ్రిందల సంసారం ఎలా సాగింది? అనేది మిగతా  కథ.
నటీనటుల హావభావాలు:
ఈ చిత్రంలో నాగ శౌర్య కనిపించిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. గతంలో తాను ఎన్నో సెటిల్డ్ రోల్స్ చేసాడు కానీ ఇది వాటికి భిన్నంగా ఉండగా దానిని తాను చాలా ఈజ్ గా చేసి ఆకట్టుకుంటాడు. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా బాగుంటుంది. కృష్ణాచారిగా డీసెంట్ నటన తన అమయాకత్వం చాలా బాగున్నాయి,  కానీ….  బ్రాహ్మణ నేపథ్యం కావడంతో ఇందులో కొన్ని పాత్రలు కావాలనే కృతకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది.  ఇక హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ చిత్రం ఓ మంచి డెబ్యూట్ అని చెప్పాలి. సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మెయిన్ లీడ్ లో మంచి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అలాగే తన రోల్ కి ఆమెనే డబ్బింగ్ చెప్పుకోవడం మరో మంచి విషయం. ఇక ఈ సినిమాలో కనిపించిన సీనియర్ నటి రాధికా కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్ ఫన్  ప్లస్ అయింది.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు అనీష్ కృష్ణ విషయానికి వస్తే తన గత సినిమాలని మించి ఆడియన్స్  కనెక్ట్  చాలా బాగా డైరెక్ట్ చేసారని చెప్పాలి. ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ న టార్గెట్ చేసుకొని తీసిన ఈ చిత్రం తన ఫన్ నరేషన్ తో ఆకట్టుకుంటాడు. కాకపోతే సినిమాలో బలమైన ఎమోషన్స్ ఎక్కడా కనిపించవు. వీటితో అయితే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆశించేవారికి చిన్న డిజప్పాయింట్మెంట్ తప్పదు. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ఓ రెండు పాటలు బాగున్నట్టుగా అనిపిస్తాయి. ఇక డైలాగ్స్ అయితే కొన్ని అంటే సుందరానికీ సినిమాలో ఉన్నట్టుగానే అనిపిస్తాయి. కెమెరాపనితనం బాగుంది. నాగ శౌర్య, షెర్లీని చక్కగా చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్, చక్కగా కుదిరాయి. ఈ చిత్రానికి నాగ శౌర్య ఫ్యామిలీ నుంచే నిర్మాణం జరగడం. వారి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి.
విశ్లేషణ:
కృష్ణ వ్రింద విహారి సినిమాలోని పాయింట్ కొత్తదేమీ కాదు. కథనం చూస్తుంటే ఇది ఎప్పటి కాలం నుంచో వస్తోన్న ఫార్మాట్‌లానే అనిపిస్తుంది. అయితే ఇందులోని లైన్, కొన్ని సీన్లు అంటే సుందరానికీ సినిమాలా ఉంటాయి. అందులో ఇందులో సేమ్ సమస్యను, సేమ్ అబద్దాన్ని వాడుకుంటారు హీరోలు. అలా ఈ సినిమాతో ఆ సినిమాకు కచ్చితంగా పోలికలు వస్తాయి. కానీ ట్రీట్మ్ంట్ పరంగా పూర్తిగా దానికి భిన్నంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో కథను అంత ఆసక్తికరంగా మల్చలేకపోయారనిపిస్తుంది. అయితే ఆ తరువాత వచ్చే సీన్ ఏంటన్నది మాత్రం ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టేస్తాడు. కథనంలో ఏ మాత్రం ఆసక్తిగానీ, ఉత్సుకత గానీ ఉండదు.  లవ్ సీన్స్ మరీ రొటీన్‌గా అనిపిస్తాయి. కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. ఇక ద్వితీయార్థంలోనే అసలు సంక్లిష్టత ఉంటుంది. భార్యాభర్తలు, అత్తా కోడలు, భార్యకు తల్లికి మధ్యలో నలిగే కొడుకు ఇలా చాలా ఫన్ క్రియేట్ అయింది. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కృష్ణ వ్రింద విహారి” లో మెయిన్ లీడ్ నుంచి ఫ్రెష్ పెర్ఫార్మన్స్ లు అలాగే కావాల్సినంత ఫన్ కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఆడియెన్స్ కి దొరుకుతుంది. కాకపోతే సినిమాలో అంతా కామెడీనే ఫిల్ అయ్యి ఉండడం వల్ల ఎమోషన్స్ బాగా మిస్సయ్యాయి.

Related Posts

Latest News Updates