సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఎంఆర్ఐ ఫెసిలిటీని తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమలులో వుందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద అంబాసిడర్లని అభివర్ణించారు. హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు శాఫ్రాన్ నిర్ణయించిందని, ప్రపంచంలోనే అతి పెద్దదని అన్నారు.
ప్రపంచ స్థాయి సంస్థ భారత్ లో ఏర్పాటు చేసే మొదటి ఇంజన్ ఎంఆర్ఓ ఇదేనని కేటీఆర్ అన్నారు. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1200 కోట్లు అని తెలిపారు. 800 నుంచి వెయ్యి మంది దాకా ఉపాధి లభిస్తుందన్నారు. శాఫ్రాన్ నిర్ణయం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.