Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాలో కొలువుదీరిన “కూచిపూడి పలావ్”

ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా కూచిపూడి వెంకట్ షెఫ్ లెస్ కిచెన్
హోటల్ పరిశ్రమలో కనీ వినీ ఎరుగని సరికొత్త సంచలనానికి  శ్రీకారం చుట్టిన కూచిపూడి వెంకట్

హోటల్ నిర్వహణలో ఎదురయ్యే అతి పెద్ద సవాల్ “వంట మాస్టర్స్” (షెఫ్స్)ను మెయింటైన్ చేయడం. ఆ సవాలుకే సవాలు విసిరి… సంచలన విజయం సాధించారు ప్రముఖ దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్. “రాజుగారి తోట, మారేడుమిల్లి” హోటల్స్ తో అసాధారణ విజయాలు అందుకున్న కూచిపూడి వెంకట్… తాజాగా “కూచిపూడి పలావ్” అనే సరికొత్త ఆవిష్కరణలో తెలుగోడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేయనున్నారు. ఆంధ్ర, తెలంగాణ, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్, అర్జైంటైనా, ఆఫ్రికా, అమెరికా… ఎక్కడైనా సరే.. షెఫ్స్ లేకుండా వేడి వేడిగా అత్యంత రుచికరమైన, ఆరోగ్యవంతమైన పలావ్ వడ్డించే “హోటల్స్”ను దర్జాగా నిర్వహించుకునే అత్యద్భుత అవకాశాన్ని అందిస్తున్నారు. కొన్నేళ్లుగా కూచిపూడి వెంకట్ చేస్తున్న పరిశ్రమ, పరిశోధనల ఫలితంగా రూపుదిద్దుకున్న “కూచిపూడి పలావ్” అమెరికాలో కొలువుదీరింది. ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త రాజు మండపాటి సారథ్యంలో అమెరికాలో
ఏర్పాటు చేసిన “కూచిపూడి పలావ్”ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా గల భోజనప్రియులకు తెలుగు రుచిని పరిచయం చేస్తున్న కూచిపూడి వెంకట్, రాజు మండపాటిలను బహుధా అభినందించారు!!

Related Posts

Latest News Updates