Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇకపై కాశీ దేవస్థానంలో మిల్లెట్లతో కూడిన ప్రసాదమే : ట్రస్ట్ కీలక నిర్ణయం

మిల్లెట్లను ప్రోత్సహించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాశీ విశ్వేశ్వరుడి దేవస్థానంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. కొన్ని రోజుల క్రిందట ప్రధాని మోదీ మాట్లాడుతూ… మిల్లెట్లను శ్రీ అన్న గా సంబోధిస్తూ… వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాశీ క్షేత్రంలో ఇచ్చే లడ్డును ఇకపై.. శ్రీ అన్నప్రసాదంగా పిలవనున్నారు. ఈ పేరుతోనే పంపిణీ చేస్తామని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. అయితే… ప్రసాదం రేట్లు మాత్రం మార్చమని, యథావిథిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ లడ్డూలను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేయనున్నారు. వీటి తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు.ఇంతకుముందు ప్రసాదాన్ని పిండి, సెమోలినా, జీడిపప్పు మరియు బాదంతో తయారు చేయబడేది. ఇప్పుడు సిద్దం చేసే లడ్డూలపై “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023” లోగో కూడా ఉంటుంది.

 

‘దేశీ నెయ్యిలో మినుములు, నువ్వులు, బెల్లం కలిపి లడ్డూలు తయారు చేస్తున్నాం. సంపూర్ణ స్వచ్ఛతను నిర్ధారిస్తాం. “ఇంతకుముందు ప్రసాదాన్ని పిండి, సెమోలినా, జీడిపప్పు మరియు బాదంతో తయారు చేయబడేది. ఇప్పుడు సిద్దం చేసే లడ్డూలపై “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023” లోగో కూడా ఉంటుంది.  ఆలయ ప్రాంగణంలో కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం’.. అని మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్  తెలిపారు. 100 గ్రాములు మరియు 200 గ్రాముల ప్యాక్‌లలో లభించే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలనే దానిపై బృందానికి శిక్షణ కూడా ఇచ్చారు. లడ్డోల తయారీ, నాణ్యత మరియు ప్యాకింగ్‌ను వారణాసి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హిమాన్షు నాగ్‌పాల్ పరీక్షించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

 

Related Posts

Latest News Updates