యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పర్చన పూజను నిర్వహించారు. శనివారము ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదార్శన నారసింహ హోమం పూజలతో భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు.ఏకాదశి పురస్కరించుకొని ఆలయ ముఖమండపంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారికి అలంకరించి రంగు రంగుల పరిమలముగల వివిధ రకముల పుష్పలతో వైభవంగా లక్ష పుష్పర్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో శాస్త్రోకక్తంగా జరిగిన నిత్యకల్యాణం,పుష్పర్చన, వేండి జోడి సేవలో పాల్గొని మోక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం తరలి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది.
