Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్…

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా తెలుగు ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. అమీర్ లాగా తానూ యాక్టింగ్ చేయాలని అనుకుంటానని, అయితే.. తమకున్న పరిమితుల వల్ల చేయలేకపోతున్నామని అన్నారు. భారతీయ సినిమాకు అమీర్ ఓ ఖజానా అని చిరు అభివర్ణించారు. ఎన్నో వైవిధ్య పాత్రలు వేసి, గొప్ప నటుడు అనిపించుకున్నాడని, అన్నారు. ఏ నటుడైనా అమీర్ నటనకు ఫిదా అవ్వాల్సిందేనన్నారు. గతంలో తెలుగు సినిమాలని పట్టించుకునే వారే కాదని, బాహుబలి, కేజీఎఫ్, త్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు. గతంలో నార్త్ , సౌత్ అన్న భేదాలు కూడా వుండేవని, ఇప్పుడు అలా లేదన్నారు.

 

ఇక… అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించాని మెగాస్టార్ ని కోరారు. తాను నార్త్ స్టార్ నని, ఆశీర్వాదాల కోసం తాను హైదరాబాద్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవికి అమీర్ ఖాన్ పానీపూరీ కూడా తినిపించారు. ఆగస్టు 11 న లాల్ సింగ్ చద్దా విడుదల అవనుంది. డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, 18 పిక్చ్రస్ సంయుక్తంగా నిర్మించాయి. అక్కినేని నాగచైనత్య కీరోల్ లో వున్నాడు. ఇక… అమీర్ సరసన కరీనా కపూర్ నటించారు. ఇక… ఈ సినిమాలో తల్లీ, కొడుకుల మధ్య వున్న బంధాన్ని బాగా చూపించినట్లు తెలుస్తోంది.

Related Posts

Latest News Updates