Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ముర్ముకు ప్రధాని మోదీతో సహా ప్రముఖుల అభినందనల వెల్లువ

రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మొదటగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ స్వయంగా ముర్ము నివాసానికి వెళ్లి, పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీ తో ముర్ము నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురూ కాసేపు పోలింగ్ గురించి మాట్లాడుకున్నారు. మోదీ, నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇక… సోషల్ మీడియా వేదికగా ఇతర ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక… ముర్ము సొంత గ్రామంలో కూడా ప్రజలు విజయోత్సవాలు చేసుకున్నారు. అన్ని రాష్ట్రాల బీజేపీ కార్యాలయాల ముందు కూడా బీజేపీ నేతలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఇక… ముర్ము విజయంపై మోదీ స్పందించారు.

“గిరిజన సమాజానికి చెందిన బిడ్డ.. అత్యున్నత పదవికి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ద్రౌపది ముర్ము గెలుపు ప్రజాస్వామ్యానికి శుభసూచకం. ఆమె అత్యుత్తమ రాష్ట్రపతిగా చరిత్రలో నిలుస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ.. పౌరులకు ముఖ్యంగా పేదలు, అట్టడుగు, అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా ఆమె ఉద్భవించారు. ద్రౌపది ముర్ము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సమాజానికి చేసిన గొప్ప సేవ, ఆదర్శప్రాయమైన జీవన ప్రయాణం ప్రతి భారతీయుడినీ ప్రేరేపిస్తాయి.”  అని మోదీ పేర్కొన్నారు.

 

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంబురాలు

ఎన్డీయే రాష్ట్రపతి ముర్ము విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలతో పాటు ఆదివాసీ, గిరిజన తండాలు, గూడెలలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకున్నారు. పలు చోట్ల బైక్ ర్యాలీలు కూడా చేసుకున్నారు. దేశంలో ఎవరూ ఊహించని విశంగా గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘన బీజేపీకే దక్కుతుందని బీజేపీ నేతలు అన్నారు. గిరిజనులకు ఉన్నతమైన రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. చరిత్రలో గుర్తుంచుకునే రోజు 21 జూలై తేదీ అని, దేశ ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళ విజయం సాధించడం సంతోషంగా వుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ అన్నారు. మరోవైపు ద్రౌపది ముర్ము విజయ వార్త వచ్చిన సందర్బంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వేములవాడ పర్యటనలో వున్నారు. అక్కడే విజయోత్సవాలు జరుపుకున్నారు.

Related Posts

Latest News Updates