చైనా నూతన ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా పార్లమెంట్ సమావేశంలో లీ కియాంగ్ అభ్యర్థితానికి అనుకూలంగా మొత్తం 2947 ఎన్పిసి సభ్యులలో 2936 ఓట్లు వచ్చాయి. దీనితో లీ కియాంగ్ ప్రధాని పదవికి ఎన్నికయినట్లు చైనా పార్లమెంట్ నిర్థారించింది. చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌కు లీకియాంగ్ అత్యంత సన్నిహితుడు. 63 సంవత్సరాల లీకియాంగ్ ఇప్పుడు ఉన్న ప్రధాని లీ కెకియాంగ్ స్థానంలో వచ్చారు. కెకియాంగ్ గత పది సంవత్సరాలుగా చైనా ప్రధానిగా ఉన్నారు.