సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమమయింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికను ఈనెల 22న నిర్వహించాలంటూ ఎల్జీ సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ సిఫార్సు చేశారు. సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆమోదించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక జరగనుంది. అనంతరం అదే రోజున డిప్యూటీ మేయర్, ఆరుగురు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్య విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు.
