ఇళయ దలపతి విజయ్ ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. అయితే… ఈ మూవీ పేరు ఏంటని అభిమానులు తెగ ఆలోచనలో పడ్డారు. చివరికి మూవీ మేకర్స్ ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేసేశారు. ‘లియో’అని సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
అయితే… ఈ సినిమాకి రెడ్ కోడ్ అనే పేరు పెట్టనున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే.. మూవీ మేకర్స్ ఊహించని టైటిల్ తో ముందుకు వచ్చారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తున్నారు. సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ బజ్ ఉంది. సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.