Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ట్రంప్ ను అంతమొందిస్తాం : ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్‌ను చంపేందుకు కొత్త మిజైల్‌ను తయారు చేశామంటూ సంచలన ప్రకటన చేసింది. 1,650 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్రూజ్ మిజైల్‌ను తయారు చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ టాప్ కమాండర్ ఆమిర్ అలీ హజిజదేహ్ ఈ హెచ్చరిక చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన మిజైల్ అని తేల్చి చెప్పారు. ఇరాన్ మిలిటరీ కమాండర్‌ కాసిమ్ సోలిమనీని చంపినందుకు ప్రతీకారంగా ట్రంప్‌ను హతమార్చుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికల తరవాత పశ్చిమ దేశాలన్నీ ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.

 

1,650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్ క్షిపణిని తాము డెవలప్ చేశామని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ అధినేత అమిరాలి హజీజాదే వెల్లడించారు. 2020 లో బాగ్దాద్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిల ఇరామన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణించాడు. దానికి ప్రతీకారంగా ఇరాక్ లోని అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. అయితే అమాయక సైనికులను చంపాలన్నది మాత్రం మా లక్ష్య కాదు. మా లక్ష్యం ట్రంప్. ఆయనను అంతమొందించేందుకే ఎదురుచూస్తున్నాం అంటూ హజీజాదే సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Posts

Latest News Updates