సామాన్యుడిపై గ్యాస్ సిలిండర్ భారం మరోసారి పడింది. ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. 14.2 కేజీల సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో గ్యాస్ బండ రేటు 1100 దాటింది. ఈ నిర్ణయంతో సామాన్యుడిపై మరింత భారం పడినట్లైంది. ఇక.. ఈ బాదుడుతో హైదరాబాద్ నగరంలో రూ. 1055 ఉన్న సిలిండర్ ధర రూ.1105 కి పెరిగింది.
ఈ నెల 1 న కమర్షియల్ గ్యాస్ బండ రేటు తగ్గించినా.. ఇప్పుడు ఇంటి సిలిండర్ ధరను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మార్చి 22 న కూడా సిలిండర్ ధర 50 రూపాయలు పెరిగింది. అంతకు ముందు 2021 అక్టోబర్, 2022 ఫిబ్రవరి నెలల మధ్య దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో 899.50 గా వున్నాయి.