మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఖాల్ ఘాట్లో అదుపు తప్పి బస్సు నదిలో పడిపోయింది. దీంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మందిని రెస్క్యూ టీమ్ రక్షించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు వున్నారు. ఇండోర్ నుంచి పూణె వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి, వంతెన రైలింగ్ ను ఢీకొట్టిందని, నదిలో పడిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు. బస్సు ప్రమాదం వార్తను అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు.
