ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై విలువ ఆధారిత పన్నును తగ్గించింది. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ తగ్గింపుతో శుక్రవారం నుంచి మహారాష్ట్రలో లీటర్ పెట్రోలు ధర 5 రూపాయలు, లీటరు డీజిల్ ధర 3 రూపాయల చొప్పున తగ్గుతుంది. ఇలా తగ్గించడం వల్ల తమ ప్రభుత్వంపై ఏటా 6,000 కోట్ల రూపాయల భారం పడుతుందని, అయినా ప్రజా క్షేమం కోసం ఈ నిర్ణయమని ఏకనాథ్ ప్రకటించారు. ఇంధన ధరలపై వ్యాట్ ను తగ్గిస్తామని సీఎం షిండే వారం క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మంత్రివర్గంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
