ఉన్నట్టుండి సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహేశ్ బాబు నటించిన అతడు సినిమాలోని పాటకు సితార సూపర్ డ్యాన్స్ చేసి, అందర్నీ ఆకట్టుకుంటోంది. పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి అనే పాటకు సితార స్టెప్పులేసింది. దీనిని మహేశ్ బాబు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.దీంతో ఇది బాగా వైరల్ అవుతోంది. నీ కళ్లల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక మహేశ్ బాబు అభిమానులు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్టుకు లక్షల్లో లైక్స్ వచ్చి చేరాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మహేశ్ బాబు కూతురు సితార ఇటు చదువుతో పాటు సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. ఇందుకు తల్లి నమ్రతా, మహేశ్ బాబు కూడా మురిసిపోతుంటారు. సితారా చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు డాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
Varasuralu – Sitara Dance 🥰
Sislu cute , sweetu ❤️🔥@urstrulyMahesh #MaheshBabu𓃵 pic.twitter.com/VbuEbolGWw— Sai Lakshmi 🦋 (@MeeSaiLakshmi) January 30, 2023