సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మహేష్ కుటుంబసభ్యులు అందరు వరుసగా కన్నుమూశారు. ఒకరి తర్వాత ఒకరు మహేష్ ను విడిచి పెట్టిపోవడంతో ఆయన ఎంతో మనోవేదనకు గురవుతున్నారట. వరుసగా అన్న, అమ్మ. నాన్నను కోల్పోయారు మహేష్. ఈ ముగ్గురంటే మహేష్ కు ప్రాణం. చాలా సందర్భాల్లో వీరి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఆ ముగ్గురు దూరంకావడంతో మహేష్ కొండత భాదను మోస్తున్నారు. అయితే మహేష్ ఈ సమయంలో ఒంటరిగా ఉండటం కంటే సినిమా సెట్ లో ఉండటమే మంచిదని కుటుంబసభ్యులు కూడా భావిస్తున్నారట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు మహేష్ హాజరయ్యారు.
