వరుసగా 3 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు.. ఇలా.. అందరూ హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ప్రధాని వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎస్పీజీ కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. అయితే.. ప్రధాని రాక దగ్గరపడుతున్న వేళ హైదరాబాద్ పోలీసులు పాత బస్తీలోని మాజిద్ అట్టర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ ఘటనపై అట్టర్.. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆమె వ్యాఖ్యలకు ఆరెస్సెస్, బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొఘల్ పురా పోలీసులు మాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పోస్టింగ్ లపై నిఘా పెట్టారు.