Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పాలమూరు- రంగారెడ్డి లిఫ్టిరిగేషన్ లో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్ వైర్ తెగిపడి… 5 గురు కార్మికులు మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. కార్మికులు పంప్ హౌజ్ లోకి దిగుతుండగా… క్రేన్ వైర్ తెగిపడింది. దీంతో 5 గురు కార్మికులు మరణించగా… మరొకరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారందరూ బిహార్ ప్రాంతానికి చెందిన వారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

Related Posts

Latest News Updates