నటుడు మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికా రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. ఇరువురి కుటుంబీకులు, అతి సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.
కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నెటిజన్స్ వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లో వీరి పెళ్లి జరిగింది. రాత్రి 8:30 నిమిషాలకు మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు వేశాడు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వైఎస్ విజయమ్మ, టిజీ వెంకటేష్, కోదండరామిరెడ్డి, పరుచూరి, దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు.