గవర్నర్ జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించడంతో బెంగాల్ గవర్నర్ స్థానానికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగి, కాస్త సాధారణ ఏర్పాట్లు జరిగే వరకూ బెంగాల్ గవర్నర్ బాధ్యతలను మణిపూర్ గవర్నర్ ఇలా గణేశన్ కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. గణేశన్ స్వస్థలం తమిళనాడు. తదుపరి ఏర్పాట్ల వరకూ బెంగాల్ గవర్నర్ గా గణేశన్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక.. బెంగాల్ గవర్నర్ గా గణేశన్ ను నియమించడంపై రాష్ట్రపతి కోవింద్ సంతోషం వ్యక్తం చేశారు.
