విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్ ఆల్వా ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతూ… అందరిపై పెద్దన్న కన్నేసి వుంచారని, బిగ్ బాస్ అన్నీ వింటున్నారని ఆరోపించారు. బీజేపీలోని తమ మిత్రులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు. నాయకులు ముఖాముఖీగా కలిసినప్పుడు కూడా గుసగుసలాడాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ ఫైర్ అయ్యారు. ఈ భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
I thank the Chairman of MTNL/ BSNL for action on my complaint. My phone services have now been restored. I’m glad that a FIR has been registered by the authorities. https://t.co/PBjS7px9AH
— Margaret Alva (@alva_margaret) July 26, 2022