తెలంగాణ పీసీసీలో చిచ్చు ఏమాత్రం చల్లారడం లేదు. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ టార్గెట్ గా కోమటిరెడ్డి బ్రదర్స్ విరుచుకుపడ్డారు. ఇది చల్లారింది అనుకునే లోపే… ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లో ఈ అల్లకల్లోలం అంతా…. రేవంత్ రెడ్డి వల్లే అంటూ మండిపడ్డారు. ఆయన వైఖరి వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్ కాంగ్రెస్‌కు నష్టం చేసే పనులు చేస్తున్నారు. ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను అగౌరవపరిచినా రేవంత్‌ను అధిష్టానం ఎందుకు మందలించలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు సరిగాలేదని, తీరు మార్చుకోకుంటే పార్టీకి నష్టమని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
