చెన్నై మెట్రోరైల్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోరైళ్లలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మళ్లీ మాస్క్ నిబంధనను విధిస్తున్నామని మెట్రో సంస్థ పేర్కొంది. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరింది. మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తప్పకుండా మాస్క్ ధరించాల్సిందేనని చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ కోరింది.