ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని పిల్లలందరూ తమ తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ వుంటున్నారు. సాధారణ ప్రజానీకం నుంచి సెలబ్రెటీల వరకూ ఇదే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన చిన్న నాటి ఫొటోలు, తండ్రులతో దిగిన ఫొటోలు, తండ్రి తమకు చేసిన సేవలు, సపర్యలు నెమరు వేసుకుంటూ పోస్టింగ్ లు పెడుతున్నారు.
ఇందులో భాగంగానే మెగస్టార్ చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్రావుతో కలిసి వున్న ఫొటోను షేర్ చేశారు. గర్వించదగిన తండ్రికి కృతజ్ఞత గల కొడుకును కావడం గొప్ప అనుభూతి” అంటూ చిరంజీవి రాశారు. అంతే కాకుండా అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా చెప్పాడు చిరంజీవి.
https://twitter.com/KChiruTweets/status/1538379564233027584?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1538379564233027584%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fchiranjeevi-tweet-on-fathers-day-spl-grk-mrgs-chitrajyothy-1822061912163667
ఇదే కోవలో ప్రిన్స్ మహేశ్ బాబు కూడా తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణతో వున్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తండ్రి అంటే ఏమిటో చూపించారని, మీరు లేకుండా నేను లేను.. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ అన్నారు.
https://twitter.com/urstrulyMahesh/status/1538390105236246528?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1538390105236246528%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2Ftelugunews%2Fchiranjeevi-tweet-on-fathers-day-spl-grk-mrgs-chitrajyothy-1822061912163667