మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. శుక్రవారం (సాయంత్రం ఢిల్లీలో ఓ ఛానల్ కాంక్లేవ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వీరు హోటల్‌లో భేటీ అయ్యారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
Thank you Shri @AmitShah ji for your Hearty Wishes & Blessings to @AlwaysRamCharan on behalf of Team #RRR for a successful Oscar Campaign & bringing home the First ever Oscar for an Indian Production! Thrilled to be present on this occasion! #NaatuNaatu #Oscars95@ssrajamouli pic.twitter.com/K2MVO7wQVl
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 17, 2023
కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో రాంచరణ్ మరింత రాణించాలని అమిత్ షా ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మరోవైపు ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశం తర్వాత మెగాస్టార్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కూడా భేటీ అయ్యారు.
Thank you very much
Sri @ianuragthakur for honoring me with the traditional Himachali Topi & Shawl from your home state, on my visit to Delhi today! Delighted! 🙏🙏 pic.twitter.com/g8BbtXkEQp— Chiranjeevi Konidela (@KChiruTweets) March 17, 2023